Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రభాస్..కల్కి రిలీజ్ డేట్ మారింది!

- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898ఏడీ. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,దిశా పటాని, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా తన పాత్ర ఉంటుందని అందరికి నచ్చుతుందన్నారు కమల్.

ఇక తొలు త ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా ఆ తేదిన రిలీజ్ అవుతుందా లేదా అన్న సందేహం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కల్కి వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మే 30న వేసవి కానుకగా తీసుకురాబోతున్నారని ప్రచారం జరుగుతోండగా దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం డబ్బింగ్ వర్క్స్ జరుపుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -