Friday, May 3, 2024
- Advertisement -

రూ.100 క్లబ్‌లో ది గోట్ లైఫ్‌!

- Advertisement -

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ది గోట్ లైఫ్. పాన్ ఇండియా లెవల్లో మార్చి 28న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి అరబ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి కథే ది గోట్ లైఫ్. గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోయి..రెండేళ్లు ఏడారిలో ప్రయాణిస్తూ అనేక కష్టాలు పడతాడు. సహజ సిద్ధంగా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు.

తొలి షో నుండే పాజిటివ్ టాక్‌తో రూ.100 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసింది ది గోట్ లైఫ్. విడుదలైన పది రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఇప్పటికి థియేటర్లలో నడుస్తుండగా ఫుల్ రన్‌లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబడుతుందో వేచిచూడాలి.

తినేందుకు సరైన ఆహారం దొరక్క విపరీతమైన ఎడారి వాతావరణంలో నజీబ్ ఎదుర్కొనే కష్టాలు సహజ సిద్ధంగా చూపించారు దర్శకుడు. నజీబ్ సాగించిన ఈ సాహసోపేత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తికరంగా నిలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -