Saturday, April 27, 2024
- Advertisement -

కల్కి వాయిదానే!

- Advertisement -

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898ఏడీ. సైన్స్ ఫిక్షన్ మూవీని మైథాలజీతో గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈ సినిమాను మే 9వ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినిమా రిలీజ్ ఖచ్చితంగా పోస్ట్‌ పోన్ అవుతుందనే తెలుస్తోంది.

దీనికితోడు వీఎఫ్‌ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండటం సినిమా వాయిదాకు ఓ కారణం అని తెలుస్తోంది. అలాగే కొన్ని సీన్లను మళ్లీ సీజీ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే కల్కిని వాయిదా వేయాలని నిర్ణయించుకోగా దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.

కల్కిలో భైరవ పాత్ర పోషిస్తున్నారు ప్రభాస్. ఈ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్. దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీలకపాత్ర పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -