Tuesday, May 14, 2024
- Advertisement -

అనుష్కతో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..?

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా.. క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత సాహో షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్.. పెళ్లి కోసం మరో ఏడాది అగాల్సిందేనని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అనుష్క‌తో పెళ్లి వార్తలు, ప్రభాస్‌కు పెళ్లి కూతురు కావాలి అని రానా చేసి ప్రకటన, తన పెళ్లిపై ప్రభాస్ వివరణ ఇచ్చాడు.

బాహుబలి మూవీ తర్వాత అనుష్కతో ప్రభాస్ ఎఫైర్ ఉందని.. త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అందుకే అనుష్క సినిమాలు ఒప్పుకోవడం లేదని.. రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్లపై ప్రభాస్, అనుష్క స్పందించి వాటిని ఖండించారు. అంతేకాకుండా తనపై ఇలాంటి వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటాం అని అనుష్క హెచ్చరించింది. అనుష్కతో పెళ్లి, అఫైర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. సినీ సెలబ్రిటీలకు అలాంటి ఇబ్బందులు తప్పవు. అలాంటి రూమర్లు రావడం చాలా సహజం. ఇలాంటి వార్తలు వస్తాయని ముందే ఊహించాను.

ఎవరైనా హీరో ఓ హీరోయిన్‌తో వరుసగా రెండు, మూడు సినిమాలు చేస్తే ఇలాంటి గాసిప్స్ రావడం చాలా సహజం అని ప్రభాస్ అన్నారు. మొదట్లో తనపై ఇలాంటి రూమర్లు వస్తే చాలా బాధపడే వాడిని. ఇప్పుడు అలాంటి వార్తలను పట్టించుకోవడం లేదు అని ప్రభాస్ పేర్కొన్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలేదని.. సాహో సినిమా తర్వాత పెళ్లి ఉంటుందని అన్నాడు. ఇక ప్రభాస్ సాహో మూవీ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -