Saturday, April 27, 2024
- Advertisement -

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..

- Advertisement -

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి హీటెక్కింది. ఇప్పటికే బీజేపీ-కాంగ్రెస్-బీఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలో దూసుకుపోతుండగా బీజేపీ 9 మందితో ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించింది కూడా. ఇక కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అధికారికంగా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.మహూబ్ నగర్ కు వంశీ చంద్ రెడ్డి, చేవేళ్ల నుండి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక తాజాగా బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ వచ్చేంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు. కరీంనగర్ – బి. వినోద్ కుమార్,పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్,ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు,మహబూబాబాద్ – మాలోత్ కవితతో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్.

గత రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. మరోవైపు కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. పెద్దపల్లి ఎంపి వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరగా నాగర్ కర్నూల్ ఎంపీ రాములు,జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌లో చేరారు. కాంక్షలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -