Sunday, April 28, 2024
- Advertisement -

బిట్ కాయిన్స్ తో జర జ్రాగత్త

- Advertisement -

‘బిట్ కాయిన్’ వ్యవహారం ప్రపంచానికి ఓ సవాల్ గా మారిపోయింది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లావాదేవీలన్నీ బిట్ కాయిన్స్ లోనే జరుగుతూ ఉండడంతో… కార్పొరేట్ స్థాయిలో మరో గ్లోబల్ కరెన్సీ ముప్పు ముంచుకొస్తోంది. డబ్బు, బంగారంలాగే.. బిట్ కాయిన్స్ ని కొనుక్కుని దాచిపెట్టుకోవడం అనేది ఒక ఖరీదైన అలవాటుగా మారిపోయింది. కానీ.. రోజురోజుకీ విలువ పెరుగుతుందన్న మాయలో పడి.. వీటి కొనుగోలు విపరీతంగా పెరిగి.. చివరకు ఒక మహాజూదంలా మారిపోయింది.

ఈఏడాది మొదట్లో ఒక బిట్ కాయిన్ విలువ… 65 వేల రూపాయలుంది. జస్ట్ 12 నెలల్లో 10 లక్షలకు పెరిగింది. మరో ఏడాదిలో 30 లక్షలు దాటుతుందన్నది ఒక అంచనాకు వచ్చారు జనాలు. నిజానికి బిట్ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ . ఏ దేశ చట్టాలూ దీన్ని ఆమోదించలేదు.. ఏ దేశపు సెంట్రల్ బ్యాంకులూ దీనికి హామి ఇవ్వడం లేవు. నిజానికి బిట్ కాయిన్స్ ని అధిక సంఖ్యలో కలిగినవారిని బిట్ కాయిన్ వేల్స్ గా పిలుస్తారు. వరల్డ్ వైడ్ బిట్ కాయిన్ మార్కెట్లో 40 శాతం దాకా ఇటువంటి 1000 మంది బిట్ కాయిన్ వేల్స్ చేతిలోనే వుందనేది ఓ అంచనా. ఇంతకంటే ఇంకో భయానక విషయం ఏమిటంటే.. ఈ వెయ్యిమందీ కూడా ఒకరికొకరు టచ్ లో ఉంటూ.. కృత్రిమ లావాదేవీలతో బిట్ కాయిన్స్ వ్యాల్యుయేషన్ మీద ప్రభావం చూపెడతారు. అంటే.. అనూహ్యంగా పెరుగుతున్న ధరను చూసి మోసపోయి బిట్ కాయిన్స్ ని కొనుక్కునేవాళ్లంతా ఈ వేల్స్ ‘ట్రాప్’లో పడినట్లే లెక్కన్నమాట.

ఇలాంటి ఆర్టిఫీషియల్ ట్రేడింగే వీటి విలువ ఇంతలా పెరిగిపోవడానికి కారణమవుతుంది. తాజాగా చికాగో మర్చంటైజ్ మార్ట్ లాంటి కొన్ని గ్లోబల్ మార్కెట్లు బిట్ కాయిన్స్ ని చెలామణీలో పెడతామని ప్రకటించడంతో వీటి మీద మోజుతో పాటు డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే.. ట్రంప్ లాంటి వారు గాని ఇండియాలో అరుణ్ జైట్లీ లాంటి ఒక్క స్టేట్ మెంట్ ఇస్తే మాత్రం… బిట్ కాయిన్స్ విలువ నైట్ కు నైట్ అమాంతం పడిపోవచ్చు. అందుకే వీటి విషయంలో అప్రమత్తంగా వుండాలంటూ మన ఆర్బీఐ బహిరంగ హెచ్చరిక చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -