Wednesday, May 1, 2024
- Advertisement -

ప్రభాస్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాహెూ చిత్రంలో నటించాడు. కానీ ఈ చిత్రం పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాతా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీలో నటిస్తున్నాడు. హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రంలో శృతి హాసన్ జర్నలిస్ట్ గా నటిస్తుంది. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. కరోనా దృష్ట్యా చిత్ర యూనిట్ కాస్త బ్రెక్ ఇచ్చింది.

తాజాగా ఈ మూవీ గురించి సినీ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ‘సలార్’ సినిమాలో లీడ్ విలన్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే అతడితో డైరెక్టర్ చర్చలు జరుపుతున్నారట. కాకపోతే ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -