Monday, April 29, 2024
- Advertisement -

రేవంతే సీఎం!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి దాదాపు ఖరారైంది. సీఎం ఎంపిక అంశాన్ని అధిష్టానానికి అప్పగించగా తీవ్ర తర్జన భర్జనల అనంతరం రేవంత్‌ను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క పేరు కూడా ఫైనల్ అయినట్లు సమాచారం.

సీఎల్పీలో ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిపారు ఏఐసీసీ పరిశీలకులు. ఇక సీఎంగా రేవంత్‌ను సీనియర్లు వ్యతిరేకించినా అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపిందని విశ్వసనీయ సమాచారం. తమ పేర్లను సైతం పరిశీలించాలని మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు కూడా. ఇక ఉత్తమ్ అయితే ఏకంగా ఇస్తే సీఎం పదవి ఇవ్వండి లేదా తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఒకవేళ రేవంత్‌ను సీఎం చేస్తే ఆయన మంత్రివర్గంలో పనిచేయనని తెలిపారు కూడా.

అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ వైపు మొగ్గుచూపారు. ఇక కాంగ్రెస్ నుండి గెలిచిన వారిలో సగానికి పైగా కొత్త వారే. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న వారే. దీంతో సీఎం అంశాన్ని మరింత జాప్యం చేయకుండా ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్. ఈ నెల 7న కొత్త సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -