Sunday, June 16, 2024
- Advertisement -

ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టా..సారీ చెప్పిన ప్రభాస్!

- Advertisement -

ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు రెబల్ స్టార్ ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

అభిమానులకు ఎంతో ఉత్కంఠ రేపిన బుజ్జిని ప్రపంచానికి పరిచయం చేశారు మేకర్స్. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​ సిటీలో ఓ స్పెషల్ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించి అభిమానుల సమక్షంలో ఇంట్రడ్యూస్ చేశారు.

ప్రభాస్​ తన బుజ్జి కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. హాయ్ డార్లింగ్స్.. బుజ్జి – భైరవ గ్లింప్స్ ఎలా ఉంది. ఎంజాయ్ చేశారా. అంటే ఈ ఈవెంట్‌కి తక్కువ మందిని తీసుకురావడానికి.. ఇలా చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మీ సేఫ్టీ కోసమే.. అందరికీ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని తెలిపారు. కమల్ హాసన్‌కు వంద దండాలు సార్… చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసిన నేను అచ్చం కమల్ హాసన్ వేసుకున్న బట్టలు కావాలని మా అమ్మని అడిగాను. అలాంటి నేను ఇప్పుడు ఆయనతో నటించడం అంటే మామూలు విషయం కాదు అని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రభాస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -