Saturday, April 27, 2024
- Advertisement -

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్!

- Advertisement -

సలార్‌తో సక్సెస్ బాట పట్టారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సలార్ తర్వాత మరో నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టారు. ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతాయని అంతా భావిస్తుండగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు రెబల్ స్టార్.

సమంత బాటలోనే కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యంతో పాటు బాడీ మీద ఫోకస్ చేసేందుకు ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్‌గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి షూటింగ్ పూర్తి చేశారు.

ఇక రాజా సాబ్ షూటింగ్ త్వరలో మొదలు కానుండగా ఇంతలోనే సినిమాలకు గ్యాప్ ఇచ్చేశారు ప్రభాస్. ఓ మూడు నెలల పాటు ఎలాంటి షూటింగ్‌లో పాల్గొనరట ప్రభాస్. ఆరోగ్యం సెట్ అయ్యాక తిరిగి సినిమాలపై ఫోకస్ చేయనున్నారని సమాచారం. రాజా సాబ్ తర్వాత సందీప్ వంగతో సినిమా, సలార్ 2 సినిమాలు కంప్లీట్ చేయనున్నారు.

సమంత కూడా అనారోగ్య సమస్యలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ కూడా ఆరోగ్యంపై దృష్టి సారించి షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం టీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -