Sunday, May 19, 2024
- Advertisement -

ఎంపీ ఎన్నికలు..పెరిగిన హస్తం డిమాండ్!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణులన్ని యాక్టివ్ అయ్యాయి. ఇక త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్.

17 ఎంపీ స్థానాలకు ఇంఛార్జీలను నియమించగా పోటీచేసే ఆశావాహులు దరఖాస్తులు చేసుకోవాలని పీసీసీ సూచించింది. అంతే 17 ఎంపీ స్థానాలకు 187 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల జాబితాకు సంబంధించిన లిస్ట్‌ను డీసీసీ అధ్యక్షులు పీసీసీ ఎన్నికల కమిటీకి అందజేశారు.

అత్యధికంగా ఆదిలాబాద్ నుండి 20 దరఖాస్తులు రాగా వరంగల్ -37,భువనగిరి – 28,మహబూబాబాద్ -19, పెద్దపల్లి – 11, హైదరాబాద్ – 10,నాగర్ కర్నూల్ – 17, కరీంనగర్ – 02,నిజామాబాద్ – 06, మెదక్ – 02, మల్కాజ్ గిరి – 08,సికింద్రాబాద్ – 04, చేవెళ్ల – 06, మహబూబ్ నగర్ – 04, నల్గొండ – 09,మహబూబాబాద్ – 19, ఖమ్మం నుండి -3 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉండగా జనరల్ కేటగిరీ నియోజకవర్గాల నుండి తక్కువ అప్లికేషన్లు వచ్చాయి. త్వరలోనే నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఇక తొలి సభ ఇంద్రవెల్లి నుండే మొదలుకానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -