Saturday, April 27, 2024
- Advertisement -

అరకు ఇంఛార్జీని మార్చిన సీఎం జగన్..

- Advertisement -

రెండోసారి అధికారమే లక్ష్యంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మారుస్తున్నారు సీఎం జగన్. వైనాట్ 175 లక్ష్యంగా ఇప్పటికే అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు ఇంఛార్జీలను మార్చారు. నియోజకవర్గాల వారీగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు జగన్‌.

అయితే తాజాగా రీసర్వే చేయించి ఇంఛార్జీగా నియమించిన కొన్ని స్థానాలను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా అరకు ఇంఛార్జీని మార్చారు జగన్‌. హుకుంపేట జడ్పీటీసీ రాగం మత్స్యలింగంను అరకు అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు.

తొలుత అరకు సిటింగ్‌ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ స్థానంలో ఎంపీ మాధవిని ఇంఛార్జీగా నియమించారు. దీంతో మాధవికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగడంతో మరోసారి సర్వే చేయించిన జగన్…మత్య్సలింగంకు సీటు కేటాయించారు. దీంతో పాటు మరికొన్ని స్థానాల్లో ఇంఛార్జీలను మారుస్తారనే ప్రచారం జరుగుతుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -