అర్జున్ వైకే దర్శకత్వంలో సుహాస్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనం. జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించగా పాజిటివ్ టాక్ రాబట్టింది.
ఇక ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుండగా దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.
యాక్సిడెంట్ లో హీరో వాళ్ల అమ్మనాన్నలు చనిపోతారు. ఇక ఈ యాక్సిడెంట్‌లో హీరోకి ఓ వ్యాధి వస్తుంది. దీని వల్ల ఎవరి మొహాలను గుర్తుపట్టలేడు. అంతే కాకుండా వాయిస్ లు కూడా గుర్తుపట్టలేడు. తన సమస్య ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తూ వస్తాడు. ఈ క్రమంలో లవ్‌లో పడటం, ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది?,ఈ సమస్య నుండి హీరో ఎలా బయటపడ్డాడు అన్నదే ప్రసన్న వదనం కథ.