ప్రెస్మీట్సా….? కిస్మీట్సా…?…. చూసుకోండి ..రాసుకోండి…వేసుకోండిబిటౌన్ బ్యాచ్ ఈ మధ్య మరీ బరి తెగించేస్తోంది. ప్రెస్మీట్ అని చెప్పి కిస్మీట్లు షురూ చేస్తోంది. దీంతో ఫిలిం రిపోర్టర్లకు దాన్ని ఫిలిం ప్రెస్మీట్ అనాలో లేక పబ్ ప్రెస్మీట్ అనాలో అస్సలు అస్సలు అర్ధం కావడం లేదు.
తాజాగా మై ఔట్ చార్లెస్ చిత్రం ప్రమోషన్ కోసం రణదీప్ హుడా,చద్దాలు ప్రెస్మీట్ పెట్టి…ఆ ప్రెస్మీట్ ను కాస్త కిస్మీట్ చేసేశారు. వీరనే కాదు గతంలో అజయ్ దేవగన్ -ఐశ్వర్యరాయ్ ,షారుక్ కాజోల్ లు ఇలాంటి ఫీట్స్ చేసారు. అంతెందుకు మాన్సూన్ ప్రెస్మీట్లో కుర్రవాడైన సుదర్శన్ ను ఏజ్ లో అతనికంటే పెద్దదైన శ్రీస్థి శర్మ….తమని చూసుకోండి, రాసుకోండి వీడియోను టీవీలో వేసుకోండంటూ బుడతడి బుగ్గను గట్టిగా కొరికేసింది.
నో వన్ కిల్డ్ జెస్సికా ప్రమోషన్ మీట్లో అయితే….రాణి ముఖర్జీ, విధ్యాబాలన్ లిప్ లాక్ లు చేసుకుని ప్రెస్ ను ప్రెస్స్ చేశేసారు. ఈ కల్చర్ ను నిజానికి షారుక్ మొదలు పెట్టాడు.కింగ్ ఖాన్ కేవలం ఇండియన్ కిస్ లతోనే ప్రతి తారను స్టేజ్ పై ముద్దాడుతూ మినిమమ్ మసాలా చూపిస్తే…వీరంతా ఇపుడు అడ్వాన్స్ గా ఆలోచించి కిస్మీట్లతో ఫుల్ మీల్స్ చూపించేసే ప్రయత్నం చేస్తున్నారు.
