Monday, May 20, 2024
- Advertisement -

2 కోట్లు డిమాండ్ చేస్తున్న ప్రియా ప్రకాష్‌

- Advertisement -

నిఖిల్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించాటానికి ప్రియా ప్రకాష్ ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేసింద‌ని స‌మాచారం.ఇంత‌కి ఈ ప్రియా ప్రకాష్ ఎవ్వ‌రు అనుకుంటున్నారా! అదేనండీ సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌గా మారిన వీడియోలో ఉంది కాదా ఆ భామ‌నే ప్రియా ప్రకాష్‌.ఒక్క సీన్‌తో యూత్ మొత్తాన్ని ఫ్లాట్ చేసిన ప్రియా ప్రకాష్ సెలబ్రిటీ అయిపోతోంది. ఓవర్ నైట్‌ స్టార్‌గా మారిన ఈ కేరళ అమ్మడుకు మూవీ ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయట. బాలీవుడ్ నుంచి కొన్ని ఛాన్స్‌లు వచ్చినట్లు తెలుస్తోంది.టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. అయితే రెమ్యునరేషన్ విషయంలో చర్చలు జరుగుతున్నాయట. కిరాక్ పార్టీ సినిమా చేస్తున్న నిఖిల్… తర్వలో మరో ప్రాజెక్ట్,‌ను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో ఈ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా ప్రకాష్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. కాని 2 కోట్లు రెమ్యునరేషన్ అడిగే స‌రికి నిర్మాత‌లు ఆలోచ‌న‌లో ప‌డ్డారు అని తెలుస్తుంది.ఎంతైనా ఒక్క వీడియోతో ఎంత పాపుల‌ర్ సంపాదిస్తే మాత్రం 2 కోట్లు అడుగుతుందా! అని నిర్మాత‌లు చేప్పుకోంటున్నారు.అంతేగా మ‌రి దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్కబెట్టుకోవాలి కాదా. ఈ మూవీతోనే ప్రియా ప్రకాష్ ఎంట్రీ ఇస్తే ఓకే మరో ప్రాజెక్ట్‌లో ఆమెను తీసుకున్నా ఆశ్చర్యం లేదేమో.

 

https://www.youtube.com/watch?v=h-33NV7Dx9U

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -