Tuesday, May 7, 2024
- Advertisement -

ద‌క్షిణాఫ్రికా ఇంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న ఎప్పుడూ చేయ‌లేదు…

- Advertisement -

ద‌క్షిణాఫ్ర‌కా టూర్‌లో భార‌త్ త‌న జోరును కొన‌సాగిస్తోంది. టెస్ట్ సిరీస్‌ను కోల్పోయినా ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండ‌గానే వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. చివరి వన్డే శుక్రవారం సాయంత్రం 4.30 నుంచి జరగనుంది. చివ‌రి వ‌న్డేకూడా గెలుస్తామ‌ని ధీమాతో ఉంది టీమిండియా.

జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌పై స‌ఫారీ జ‌ట్టు ఓపెన‌ర్స్ ఆమ్లా స్పిందించారు. ద‌క్షిణాఫ్రికా జట్టు గతంలో చాలా కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంది.. కానీ.. ఇంత పేలవ ప్రదర్శనతో నిరాశపర్చింది లేదని ఆ జట్టు ఓపెనర్ హసీమ్ ఆమ్లా ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్‌తో జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌ని ఒక వన్డే మిగిలి ఉండగానే 1-4 తేడాతో దక్షిణాఫ్రికా చేజార్చుకున్న విషయం తెలిసిందే. .

ముగిసిన ఐదు వన్డేల్లో భారత్ తరఫున విరాట్ కోహ్లి (2), శిఖర్ ధావన్ (1), రోహిత్ శర్మ (1) ఇలా నాలుగు శతకాలు నమోదవగా.. దక్షిణాఫ్రికా తరఫున ఒక శతకమే నమోదైంది. అదీ.. తొలి వన్డేలో కెప్టెన్‌ డుప్లెసిస్ చేసింది. కానీ.. ఆ వన్డేలో గాయపడిన డుప్లెసిస్ సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు.

సిరీస్‌లో భారత మణికట్టు స్పిన్నర్ల ధాటికి సఫారీ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవలేకపోతున్నారు. వారు గెలిచిన నాలుగో వన్డే మినహా.. ఏ వన్డేల్లోనూ చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు పోటీనివ్వలేకపోయారు. చివరి వన్డేలోనూ.. వారు భారత స్పిన్‌ని ఎదుర్కొని క్రీజులో నిలవడం కష్టమనే చెప్పాలి. మీడియాతో మాట్లాడిన అమ్లా2008లో అనుకుంటా.. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఇబ్బందిపడ్డాం. కానీ.. మరీ ఇంతలా పేలవ ప్రదర్శన చేయలేదు. జట్టులో చాలా మంది యువ క్రికెటర్లు ఉన్నారు. వారు ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి’ అని ఆమ్లా సూచించాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -