Sunday, May 12, 2024
- Advertisement -

ప్ర‌జా బ‌లం నిండుగా ఉన్నా వైసీపీలో లోపం ఎక్క‌డ‌….?

- Advertisement -

అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శ‌ని ఉన్న‌ట్లు జ‌గ‌న్‌కు ప్ర‌జాబ‌లం ఉన్నా క్షీత్ర‌స్థాయిలో మాత్రం క్యాడ‌ర్ బ‌లం దెబ్బ కొడుతోంది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటె ప్ర‌ధానంగా క్యాడ‌ర్ ముఖ్య‌మ‌న్న సంగ‌తి తెలిసిందె. ఇదే ఇప్పుడు జ‌గ‌న్ ముందున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఎంత ప్ర‌జా బ‌లం ఉన్నా కిందిస్థాయిలో పార్టీకి ఓట్లు రావ‌డంలో క్యాడ‌రే ముఖ్యం.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నానాపాట్లు ప‌డుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తూ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర పేరుతో మ‌హా పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తున్నారు. ఇది దాదాపు ఆరు నెల‌ల‌పాటు పాద‌యాత్ర కొనసాగుతుంది. పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డంతోపాటు…గ‌త ఎన్నిక‌ల్లో బాబు ఇచ్చిన హామీల వైఫ‌ల్యాల‌ను కూడా ప్ర‌జ‌ల‌ల్లోకి తీసుకెల్ల‌నున్నారు జ‌గ‌న్.

ఇదిలా ఉంటె జ‌గ‌న్‌కు ప్ర‌జా బ‌లం పుస్క‌లంగా ఉన్నా క్యాడ‌ర్ లేక‌పోవ‌డం జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్సే అని చెప్పాలి. క్షేత్ర స్థాయిలో క్యాడ‌ర్‌ను అభివృద్ధి చేయ‌కుండా జ‌గ‌న్ త‌న ఫేస్ వ్యాల్యూతోనె గెలుస్తామ‌న‌డం ఆయ‌న మూర్ఖ‌త్వం అవుతుంది. ఎక్క‌డైనా గ్రామ స్థాయిలో ఉన్న ఓటుబ్యాంకే అధికారంలోకి రావాడానికి ప్ర‌ధానం. అక్క‌డ ఉన్న క్యాడ‌ర్‌తోపాటె ఓటు బ్యాంక్‌కూడా ఆధార ప‌డిఉంటుంది. వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నా బ‌ల‌మైన క్యాడ‌ర్ లేద‌నె చెప్పాలి. జ‌గ‌న్ ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేసినా ప్ర‌జా స్పంద‌న అమోఘ‌మ‌నె చెప్పాలి. కాని ప్ర‌జాబ‌లాన్ని ఓట్లుగా మ‌లుచుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు.

ఉదాహ‌ర‌గా చూసుకుంటె మొన్న నంద్యాల , కాకినాడ ఉప ఎన్నిక‌లె నిద‌ర్శ‌నం. జ‌గ‌న్ అక్క‌డ ప్ర‌చారం చేసిన‌న్ని రోజులు ప్ర‌జా స్పంద‌న అద్భుతంగా ఉంది. స‌భ‌ల‌ను ఏర్పాటుచేసినా, రోడ్‌షాల‌ను నిర్వ‌హించినా ప్ర‌జ‌లు మాత్రం తండోప‌తండాలుగా వ‌చ్చారు. విజ‌యం వైసీపీదేన‌ని అనేక స‌ర్వేలు చెప్పాయి. కాని చివ‌రికి జ‌రింగిందేమిటి వైసీపీ పెట్టుకున్న ఆశ‌లు త‌ల‌కిందుల‌య్యాయి. టీడీపీ అభ్య‌ర్తి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి భారీ విజ‌యంతో గెలిచారు. ఇక్క‌డ స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న దేమంటె అధికార‌పార్టీ క్యాడ‌ర్ క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉండ‌టంతోనె విజ‌యం సాధించింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నా క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన క్యాడ‌ర్ లేద‌ని దీన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. టీడీపీలో చంద్ర‌బాబు త‌ప్ప మ‌రో జ‌నాక‌ర్శ‌న ఉన్న నేత లేర‌నె చెప్ప‌వ‌చ్చు. కాని క్షేత్ర‌స్థాయిలో పార్టీ కి ఉన్న బ‌ల‌మైన క్యాడ‌రే ఆపార్టీకి శ్రీరామ‌ర‌క్ష‌. క్షేత్ర‌స్థాయి క్యాడ‌ర్ లేకుంటె ఏపార్టీ మ‌నుగ‌డ ఎక్కువ కాలం సాగించ‌లేదు. క‌నీసం ఇప్ప‌టికైనా జ‌గ‌న్ బంధుప్రీతి వ‌దిలి గ్రామ‌స్థాయినుంచి పార్టీ క్యాడ‌ర్‌పై దృష్టి పెట్ట‌క‌పోతె చివ‌రకు మిగిలేది జ‌గ‌న్‌కు శంక‌ర‌గిరి మాన్యాలె.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -