Thursday, May 16, 2024
- Advertisement -

ప్రియాంక దెబ్బ… అమితాబ్ అబ్బా..

- Advertisement -

హీరోలను మించిపోతోంది ఆ హీరోయిన్. ఎంత ఎత్తుకు ఎదిగిపోతోందో అని అందరూ తెగ హైరానా పడిపోతున్నారు. ఇంతకీ ఎత్తు అంటే హైటులో అనుకుంటున్నారా.. కాదండి బాబు..అందనంత ఎత్తు ఎదుగుతున్న ఆ తార ఎవరో అనుకుంటున్నారా. ఎవరో కాదు… అందాల శిల్పం ప్రియాంక చోప్రా. అంత ఎత్తు ఎక్కడ అనుకుంటున్నారా.

ఎక్కడో కాదండి. ఇన్ స్టాగ్రామ్ లో ప్రియాంక చోప్రా ఫాలోయర్స్ నానాటికి పెరిగిపోతున్నారు. బాలీవుడ్.. హాలీవుడ్ అంటూ అన్ని వుడ్ లలోనూ నటించేస్తున్న ప్రియాంక చోప్రా ఫాలోయర్స్ సంఖ్య 60 లక్షలు దాటింది. ఈ రికార్డు చూసి బాలీవుడ్ హీరోలు వామ్మో.. ప్రియాంక అనుకుంటున్నారు. ఈ ఫాలోయర్స్ లిస్టులో ఫారూఖ్ ఖాన్ కు 12 లక్షలు, సల్మాన్ ఖాన్ కు 35 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.

ఈ కండల గండల వీరులు ప్రియాంక చోప్రాను అందుకుంటారా అని బాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు. ప్రియాంక దెబ్బకు బిగ్ బి కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇంతకీ ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ఉన్న ఫాలోయర్స్ పన్నెండంటే పన్నెండు లక్షల మందేనట. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -