Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ సినిమాపై అసలు నిజం ఇదే!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఈ సమ్మర్‍కి వస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వస్తుండగా కాజల్ పవన్ సరసన హీరోయిన్‍గా నటిస్తుంది. గతంలో పవన్ నటించి ‘గబ్బర్ సింగ్’ భారీ విజయం సాధించడంతో మరోసారి ఆయన పోలీస్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ త్వరలో తమిళ వేదాలం సినిమా రీమేక్ లో నటించబోతున్నాడు అనే వార్తలు వచ్చిన విషయ్ం తెలిసిందే. ఐతే ఈ సినిమాని ఎన్టీఆర్‍తో రభస వంటి సినిమా తీసిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు అని మీడియాలో న్యూస్ తెగ హల్ చల్ చేసింది.

ఐతే ఈ వార్తలో నిజాలు ఎంతవరుకు ఉన్నాయో తెలియదు కాని రీసెంట్ గా నిర్మాత ఎ.ఎమ్ రత్నం గారు ఓ క్లారిటీ ఇచ్చారు. ఎ.ఎమ్ రత్నం మాట్లాడుతూ పవన్ ని కొద్ది రోజుల క్రితం కలిసాం. తమిళ సూపర్ హిట్ వేదాలం ను రీమేక్ ని ఖరారు చేసుకున్నాం. ఐతే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది ఇంక పైనలైజ్ చేయలేదు. త్వరలోనే ఈ సినిమాకి సంభందించి పూర్తి వివరలు తెలియజేస్తాం అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -