Tuesday, May 21, 2024
- Advertisement -

అదృష్టం అంటే ఈ కుర్రాడిదే!

- Advertisement -

వరస హిట్స్‌తో దూసుకేళ్ళిన రాజ్ తరుణ్‍కి రీసెంట్ గా బ్రేక్ పడింది. తాజాగా రాజ్ తరుణ్ నటించిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రిలీజ్ అయిన మొదటి రోజే నెగిటివ్ టాక్ రావడంతో సినిమా ప్లాప్‍గా నిలిచింది. వరసగా హ్యాట్రిక్ కొట్టిన రాజ్‍కి ఈ సినిమా ప్లాప్ ఇచ్చి నిరశపరిచింది.

సో ఇక తన తదుపరి సినిమా ఎంపిక విషయంలో జాగ్రత్తగా వేళ్లాలి అని డిసైడ్ అయ్యాడట. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చిత్రం ప్లాప్ అయిన కలక్షన్లు బానే వసులు చేసిందట. ఐతే ఈ చిత్రంతో ప్లాప్ వచ్చిన మనోడికి డిమాండ్ మాత్రం బాగానే ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్‍కి ఓ బంఫర్ ఆఫర్ వచ్చింది. అవును సీనియర్ డైరెక్టర్ అయిన కె. రాఘవేంద్రరావు రారి దగ్గర నుండి ఈ కుర్రాడికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

రాజ్ తరుణ్ నటన నచ్చి ఈ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. సంతానం భవతి అని ఈ చిత్రాన్నికి టైటిల్ పెట్టే అవకాశం ఉంది. త్వరల్లోనే షూటింగ్ ప్రరంభం కానుందని తెలుస్తుంది. రాఘవేంద్ర రావు-నాగర్జున కాంబినేషన్‍లో రావాల్సిన ఓ భక్తి సినిమా వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచి విష్ణుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -