Monday, May 5, 2025
- Advertisement -

బూతు పేరుతో పృధ్వీ రాజ్ ?

- Advertisement -

టాప్ గేర్ కమీడియన్ గా బ్రహ్మానందాన్ని తలదన్నేసాడు కమెడియన్  పృధ్వీ రాజ్. ఏళ్ళ తరబడి ఇండస్ట్రీ లో ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే అతని కెరీర్ మలుపు తిరిగింది .. అప్పట్లో తిర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఫేమస్ అయిన పృధ్వీ రాజ్ ఇప్పటివరకూ ఎదురు చూసీ చూసీ ఇన్నాళ్ళ తరవాత బ్రేక్ తెచ్చుకున్నారు.

పంచ్ లు వెయ్యడం డైలాగ్ మాడ్యులేషన్ లు ఇవ్వడం లో పృధ్వీ  రాజ్ చాలా టాప్ నాచ్ కమీడియన్ గా మారిపోయారు సెల్ఫీ రాజా కోసం పృథ్వీ చెప్పిన ఓ పంచ్ బాగా పేలింది. అల్లు అర్జున్ చెప్పిన ‘చెప్పను బ్రదర్’ ను పంచ్ డైలాగ్ గా భలే పేల్చాడు పృథ్వీ. ఇప్పుడీ పృథ్వీకి వెంకీ-మారుతి మూవీ బాబు బంగారంలో ఓ మాంచి కేరక్టర్   దక్కిందంటున్నారు. ఆ పాత్ర పేరు ‘బత్తాకాయల బాబ్జీ’.

గతంలో అమ్మ నా బత్తాయో అనే డైలాగ్ ని చెప్పి పృథ్వీ మెప్పించాడు. ఆ ఇన్ స్పిరేషన్ తోనే ఇలాంటి టైటిల్ పెట్టారని అనుకోవచ్చు కానీ.. మరీ బూతు వింటున్నట్లుగా ఉందనే కామెంట్స్ పడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -