Wednesday, May 1, 2024
- Advertisement -

పుష్ప 2..మేకర్స్‌కి సరికొత్త టెన్షన్!

- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రంతో బన్నీ ఉత్తమ జాతీయ నటుడిగా ఎంపికయ్యారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా ఆగస్టు 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుండి రిలీజైన వీడియోలు, బన్ని లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఈ సందర్భంగా సినిమా నుండి ఫోటో లీక్ అయింది. అల్లు అర్జున్ చీర కట్టుకొని కూర్చున్న ఫోటో లీక్ కాగా వైరల్‌గా మారింది. తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా ఈ ఫోటో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇక బన్నీ ఫోటో లీక్‌తో మేకర్స్ టెన్షన్‌లో పడగా ఫోటో మాత్రం వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -