Tuesday, May 14, 2024
- Advertisement -

రాజానగరం..రాజా ఎవరో?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న పేరు రాజానగరం. రిపబ్లిక్ డే సందర్భంగా చంద్రబాబుకు పవన్ ఇచ్చిన షాక్‌తో రాజానగరం పేరు మార్మోగిపోయింది. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ పవన్…రాజోలు, రాజానగరంలలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక రాజానగరంలో అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఇదే టీడీపీ – జనసేన మధ్య వివాదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.

టీడీపీ నుండి బొడ్డు సీటు ఆశీస్తుండగా జనసేన నుండి బత్తుల బలరామక్రిష్ణ తీవ్రంగా పోటీపడుతున్నారు. జనసేనకు సీటు కేటాయిస్తే ముకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు టీడీపీ నేతలు. ఇక వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మంచి ఆదరణ ఉంది. ఇదే తనను ఈసారి విజయతీరాలకు చేరుస్తుందని ధీమాగా ఉన్నారు రాజా.

నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. కమ్మ నియోజకవర్గంగా పేరు తెచ్చుకోగా ఇక్కడ కాపు, యాదవ వర్గాలే డిసైడింగ్ ఫ్యాక్టర్. కమ్మ సామాజికవర్గంలో జక్కంపూడి ఫ్యామిలీకి మంచి ఆదరణ ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేశారు జక్కంపూడి. టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఉన్నా చంద్రబాబు మాత్రం బొడ్డుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే బొడ్డు స్థానికుడు కాదు. అదే ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. జనసేన అభ్యర్ది బలరామక్రిష్ణ పై అనేక అవినతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో టీడీపీ – జనసేన పొత్తులో సీటు ఎవరికి ఇచ్చినా ఇక్కడా విజయం మాత్రం వైసీపీదేనని చెబుతున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -