Monday, April 29, 2024
- Advertisement -

తెలంగాణ నుండి సోనియా..ప్లేస్ ఫిక్స్!

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇక ముఖ్యంగా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు పాలన మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో గెలుపుపై వ్యూహ రచన సిద్ధం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పదికి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కివచ్చినట్లు తెలుస్తోండగా బీఆర్ఎస్ సైతం చేవెళ్ల నుండి రివ్యూ ప్రారంభించింది.

ఇక ఈసారి జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని పీసీసీ తీర్మానించింది. ఈ తీర్మానం జరిగిన వెంటనే కాంగ్రెస్ ఇంఛార్జీగా దీప్ దాస్ మున్షిని నియమించింది. అయితే సోనియా పోటీ చేస్తే ఎక్కడి నుండి పోటీ చేయిస్తే బాగుంటుందని తీవ్ర చర్చ జరిపారు కాంగ్రెస్ నేతలు. తొలుత మెదక్ స్థానం అని ప్రచారం జరిగిన తాజాగా మల్కాజ్‌గిరి నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుండి ఎంపీగా గెలుపొందారు రేవంత్. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి సీఎం పదవి చేపట్టారు. ఇక బీఆర్ఎస్ సైతం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక్కసారి కూడా ఈ స్ధానం నుండి గెలుపొందలేదు. దీంతో ఈసారి మాజీ మంత్రి మల్లారెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తోంది. ఇక బీజేపీ నుండి ఎన్.రామచంద్రరావు, మురళీధర్ రావు,తో పాటు సినీ సెలబ్రెటీని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోనట్లు తెలుస్తోంది. మొత్తంగా సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేయడం దాదాపు ఖాయమైందని ప్రచారం జరుగుతుండగా కాంగ్రెస్ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -