Sunday, April 28, 2024
- Advertisement -

పుష్ప 2కి అడ్డు పడుతున్న ప్రకృతి.. ఏం చేయాలో తోచని పరిస్థితిలో సుక్కు..!

- Advertisement -

సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ కాగా సెట్స్ మీద ఉన్న పార్ట్ 2 గురించి కూడా ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే పుష్ప 2 సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 నుంచి వచ్చిన టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు రెట్టింపు చేయగా సుకుమార్ పుష్ప 2 ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ కి ప్రకృతి అంతరాయం కలిగిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పడుతున్న వర్షాల కారణంగా షూటింగ్ చేయలేకపోతున్నారు చిత్ర యూనిట్. ఒక భారీ యాక్షన్ సీన్ చేయాల్సి ఉండగా ఆ సీన్ కు కావాల్సిన పొడి నేల లేకపోవడం తో షూటింగ్ ఆపేశారట. రీసెంట్ గా సుకుమార్ యూఎస్ ట్రిప్ వెళ్లొచ్చాడు. వచ్చీ రాగానే పుష్ప 2 షూటింగ్ కొనసాగించాలని అనుకోగా వర్షాల వల్ల అది వాయిదా వేయాల్సి వచ్చింది.

పుష్ప 2 సినిమా కోసం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 లో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని అవన్ని సినిమాకు బలంగా నిలుస్తాయని అంటున్నారు మేకర్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -