Wednesday, May 15, 2024
- Advertisement -

వర్షాకాలం జలుబు, కఫం తగ్గించే ఇంటి చిట్కాలు.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి..!

- Advertisement -

వేసవి తాపం తగ్గింది హమ్మయ్య అనుకుని మాన్సూన్ సీజన్ ని వెల్కం చెప్పాం అయితే ఎంత ఎండ ఉన్నా సరే అవసరమైతే ఏసీ కార్లలో ప్రయాణాలు సాగించవచ్చు.. కానీ వర్షం తో ప్రయాణం ముందుకు సాగదు. పర్లేదు అనుకుని వర్షం లో జర్నీ చేసినా ఆ తర్వాత మొదలవుతుంది అసలు సినిమా. వర్షాకాలం తరచు జలుబు, కఫం పట్టేయడం లాంటివి జరుగుతుంటాయి. ఈమధ్య కాలం లో జలుబుని కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు అందుకే జలుబు, కఫం కొద్దిగా వచ్చినప్పుడే దాన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.

కఫం పట్టినప్పుడు ఏం చేయాలి అంటే మూడు నాలుగు పద్ధతుల్లో దాని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని తెలుస్తుంది. అన్ని ఇంట్లో దొరికే వాటితోనే జలుబు, కఫం నుంచి బయటపడొచ్చు. ఇంతకీ అదేంటి అంటే రోజు లెమెన్ టీ తీసుకోవడం వల కఫం తగ్గించవచ్చు. లెమెన్ టీలో టీ స్పూన్ తేనే కలుపుకుని తీసుకుంటే బెటర్. ఇక యూకలిప్టస్ ఆయిల్ కూడా చాతిలో పెరిగిన కఫాన్ని తగ్గిస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ ని కొబ్బరి నూనెతో కలిపి ఆయిల్ లో రాసుకుంటే మంచి సత్ఫలితాలు ఇస్తాయి.

ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫాన్ని తగ్గించేందుకు ద్రాక్ష కూడా ఉపయోగపడుతుంది. గ్రేప్ జ్యూస్ తాగితే బెటర్. వేడి పాలలో మిరియాలు, పసుపు కలుపుకుని తాగడం వల్ల కూడా కఫం తగ్గించే అవకాశం ఉంది. వేడి నీటిలో అల్ల రసం కలుపుకుని తీసుకున్నా జలుబు కఫం లాంటివి తగ్గుతాయని తెలుస్తుంది. ప్రతి దానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకుండా ఇలా ఇంటి వైద్యం వాడితే మంచిదని నేచురోపతీ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -