Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబు హడావిడి , పెరుకోసమే

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పాలనా విషయం అటుంచితే సంక్షేమంలో పూర్తిగా తన పేరే కనిపించాలని తహతహలాడుతున్నారు. అయితే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరుతో ఉన్న పథకాలకు సైతం చంద్రబాబు తన పేరుతో కొనసాగిస్తుండటం రోజు రోజుకూ వివాదాస్పదం అవుతోంది. తాజాగా కాపు సంక్షేమ భవనానికి చంద్రన్న పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆ వర్గం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబుకు ఫుల్ సపోర్టు ఇస్తున్న ముద్రగడ పద్మనాభం చంద్రన్నకు షాక్ ఇచ్చినంత పని చేశారు. రామన్న పేరుకు బదులు చంద్రన్న పేరు ఎందుకు పెడుతున్నారని ముద్రగడ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

నిజానికి గతంలో 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తన పేరును విరివిగా వాడుకోలేదు. ఎన్టీఆర్ పేరును చెరగనివ్వకుండా.. పలు సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు వంటి వాటికి పెద్దాయన్న పేరు పెట్టారు. కానీ ఈ సారి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు తన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.   ప్రతి సంక్షేమ పథకానికి ముందు చంద్రన్న పేరు జోడించడం అనవాయితీ మారిపోయింది. పండుగలకు చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తోఫాల పేరిట నిత్యావసర వస్తు వులు పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేసింది.

కాపులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన చంద్రబాబు అక్కడా తన మార్క్  రాజకీయం చేసేశారు. ఏపీలో తొలుత ఐదు జిల్లాల్లో నిర్మించలనుకుంటున్న కాపు కాపు సంక్షేమ భవనాలకు చంద్రన్న పేరునే ఖరారు చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న  కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు  ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు.  కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేకపోతే  సం “కుల” సమరానికి దారితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారట. 

ఏదేమైనా చంద్రబాబు తీసుకునే ప్రతీ నిర్ణయం వివాదాస్పదమౌతుండటం అటు పార్టీ నేతలనూ కలవరపెడుతోంది. అధినేత తీసుకుంటున్న హడావుడి నిర్ణయాలు  ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతాయని తమలో తామే చర్చించుకుంటున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -