Monday, May 13, 2024
- Advertisement -

హ్యాట్స్ ఆఫ్ లారెన్స్ – నీకు ఎవడూ సాటి రాడు

- Advertisement -

డబ్బులు ఎంత ఉంటే అంత దాన్ని ఎక్కువ చెయ్యడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళని చూసాం కానీ ఉన్నంతలో అంతా ఇచ్చేసేవారిని కూడా చూస్తున్నాం ఇప్పుడు. అందులోనూ ఒక హీరోగా డైరెక్టర్ గా మంచి పేరు ఉన్న రాఘవా లారెన్స్ అంటే అందరికీ స్పెషల్ అభిమానం ఈ విషయం లోనే.

లారెన్స్ అందించిన సహాయం ద్వారా ఇప్పటికి దాదాపు 128 మంది పేదలకి మేజర్ ఆపరేషన్ లు జరిగాయి అంటే ఇది మామూలు విషయం కాదు. ఇలాంటి సర్జరీలు చేయిస్తూ విషయం బయటకి చెప్పుకునే అలవాటు లారెన్స్ కి లేదు కానీ మొట్ట మొదటి సారి బోసి నవ్వుల పిల్లాడి ఫోటో ట్విట్టర్ లో పెట్టి మరీ విషయం చెప్పాడు లారెన్స్.

మొన్న చెన్నై వరదల సందర్భంగా లారెన్స్ దాదాపు నెల రోజుల పాటు తన పనులన్నీ మానుకుని.. తన టీంతో కలిసి ఎంత కష్టపడ్డాడో.. ఎన్ని వేల మంది కడుపులు నింపాడో.. ఎంత ఖర్చు పెట్టాడో అందరికీ తెలుసు. ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు సైలెంటుగా చేసుకుపోతుంటాడు లారెన్స్. అతడి పెద్ద మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -