కేంద్ర ప్రభుత్వానికి అణిగి మణిగి ఉండే రోజులు పోయినట్టు ప్రవర్తిస్తున్నారు ఏపీ – తెలంగాణా ప్రభుత్వాల వారు. పార్లమెంట్ సమావేశాల లో భాగంగా ఏపీ కి చెందిన కాంగ్రెస్ , టీడీపీ ముఖ్య నేతలు , తెలంగాణా కి చెందిన తెరాస నేతలు కేంద్రం మీద దాడి మొదలు పెట్టారు. ఆర్ధికంగా ఏపీ చాలా కష్టాల్లో ఉంది అనీ వారికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అనీ వారు లోక్ సభ లో గోల గోల చేసారు.
ఒకరకంగా ఎప్పుడూ లేనంతగా తమ స్వరం వినిపించే ప్రయత్నం చేసారు. గులాంనబీ అజాద్ – దిగ్విజయ్ సింగ్ వంటివారంతా ఏపీ కోసం గట్టిగా మాట్లాడారు. మరోవైపు లోక్ సభలో టీఆరెస్ సభ్యులు కూడా మోడీ సర్కారును నిలదీశారు. ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని టీఆరెస్ ఎంపీ జితేందర్ రెడ్డి మండిపడ్డారు.
ఏపీకి అన్నీ కేటాయిస్తున్నా తెలంగాణకు ఏమీ కేటాయించడం లేదన్న ఆయన ఏపీకి ఇవ్వడంతో పాటు తెలంగాణకు కూడా ఇవ్వాలని సమన్యాయం పాటించాలని అన్నారు. ఆయనకు మద్దతుగా నిజామాబాద్ ఎంపీ కవిత – ఇతర సభ్యులు కేంద్రం వైఖరి పట్ల నిరసన తెలిపారు. ఏపీ – టీజీ ప్రభుత్వాలు అసంబ్లీ లో సైలెంట్ గా ఉండి ఇలా పార్లమెంట్ లో తమ స్వరం వినిపిస్తూ ఉన్నాయి.
