Sunday, April 28, 2024
- Advertisement -

మహేష్ కోసం భారీ స్కెచ్.. రాజమౌళి మెగా మాస్టర్ ప్లాన్..!

- Advertisement -

మహేష్ సినిమా అంటే మామూలుగానే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటిది రాజమౌళితో సూపర్ స్టార్ సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రం డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత రాజమౌళితోనే సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా విషయంలో ప్లానింగ్ మాత్రం భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేయగా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక సినిమా స్టార్ట్ అవకుండానే రాజమౌళి మహేష్ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ దగ్గర నుంచి మిగతా కాస్టింగ్ గురించి కూడా సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ సినిమా కోసం రాజమౌళి మెగా మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. అదేంటి అంటే మహేష్ సినిమా కోసం రాజమౌళి ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ ని దించుతున్నాడట. అందరు కూడా బాలీవుడ్ క్రేజీ స్టార్స్ అని తెలుస్తుంది.

ఆ ముగ్గురిలో ఒకరు క్రేజీ హీరో కూడా ఉన్నాడని అంటున్నారు. రాజమౌళితో సినిమా అంటే దాని లెక్క వేరేలా ఉంటుంది. అందుకే మహేష్ తో కూడా సినిమా కోసం 3 నెలలు వర్క్ షాప్ ఏర్పాటు చేయిస్తున్నారట రాజమౌళి. ఈ సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్లు డేట్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ వైజ్ తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన రాజమౌళి మహేష్ కోసం ఈసారి ఏకంగా హాలీవుడ్ సినిమానే చేస్తున్నాడని తెలుస్తుంది.

మహేష్ కూడా ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు రాజమౌళి సినిమా షూటింగ్ చేయాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు మహేష్. తప్పకుండా ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా రికార్డులలో నెంబర్ 1 గా నిలుస్తుందని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -