Saturday, April 27, 2024
- Advertisement -

అభ్యర్ధి ఎంపికపై అసంతృప్తి.. ఓడిస్తానన్న సొంత పార్టీ నేత..!

- Advertisement -

సింహపురిలో టీడీపీ కేడర్ ని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు టీడీపీ నేతలు. అంతా బాగానే జరుగుతున్న టైం లో మాజీ మంత్రి వచ్చి వారికి షాక్ ఇచ్చాడు. అక్కడ సీటు తనదే అంటూ తనది అనుకుంటూ పార్టీలో అతర్గత విభేధాలు బయట పడేలా చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రితో ఉన్న బంధం వల్ల ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అప్పటికే అక్కడ కేడర్ కోసం శ్రమించిన కార్యకర్తలు నిరాశతో ఉన్నారు.

ఇంతకీ ఎవరా మాజీ మంత్రి.. నెల్లూరు టీడీపీలో ఈ అసంతృప్తి జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ ప్రాధాన్యత లేకపోవడంతో పాటుగా లోకేష్ పాదయాత్రలో సరైన హామీ రాకపోవడం వల్ల అక్కడ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. నెల్లూరు సిటీ, రూరల్ పరిస్థితి పార్టీకి పెద్ద హెడేక్ గా మారింది. సిటీ నియోజకవర్గం లో మాజీ మంత్రి నారాయణ రీ ఎంట్రీ ఇవ్వడంతో అప్పటిదాకా ఇంచార్జిగా చేసిన కోటమ్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని అధిష్టానం పక్కన పెట్టింది. అయితే అతనిక్ ప్రధాన కార్యదర్శి గా నామమాత్రపు పదవి అప్పగించినా లోకేష్ పాదయాత్రలో ఆయనను పట్టించుకోలేదు.

పార్టీ ఓడిపోయాక మాజీ మంత్రి నారయణ సిటీ పార్టీ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు సిటీలో బలమైన నేతగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అనీల్ ను ఎదుర్కొనడం నారాయణకు సాధ్యం కాదని కోట రెడ్డి అంటున్నారు. నిలబడి ఎదురు నిలబడిన అనీల్ ను ఇప్పటివరకు పార్టీని కాపాడితే తనను పక్కన పెట్టారని తన సహకారం లేకుండా సిటీలో నారాయణ గెలుపు సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు.

రాజకీయ చేస్తున్నారని.. ఇదే జరిగితే.. ఆయన మరోసారి ఓడిపోవడం ఖాయమని సిటీ నేతలు వెళ్లడిస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ వ్యవహారం పై జిల్లా పార్టె అధ్యక్షుడు అజీజ్ కూడా సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే కోటమ్రెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి నారాయణ గొంతు కోశారని అజీజ్ అంటున్నారు. నారాయణ తనకు వెన్నుపోటు పొడిచారని.. నెల్లూరు సిటీ, రూరల్ లో ఉన్న తనకు ఓటు బ్యాంక్ తో నారాయణని కోటం రెడ్డిని ఓడిస్తానని అజీజ్ శపథం చేశారు. నారాయనని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ నాయకులే అంటున్నారు. కేడర్ లేని నారాయణకు సీటు ఇస్తే మళ్లీ ఓటమి తప్పదని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -