Saturday, April 27, 2024
- Advertisement -

మహేష్ తో రాజమౌళి సినిమా.. ఇక సంచలనమే..

- Advertisement -

బాహుబలి సిరీస్ ప్రపంచానికి.. తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి.. ఏ సినిమా చేస్తాడా అని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాడు. అయితే ఎప్పుడు సినిమా చేస్తాడు..? ఏ హీరోతో సినిమా చేస్తాడు..? ఎలాంటి సినిమా చేస్తాడు అని ప్రేక్షకులే కాదు అన్ని సినిమా ఇండస్ట్రీల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వారి ఎదురుచూపుల తెరదించాడు రాజమౌళి. రీసెంట్ గా ఓ ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమా గురించి తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్ట్స్ సినిమా అని అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని మీడియా కు తెలిపారు. నా తర్వాతి సినిమాలో ఎవరు నటిస్తారు.. దాన్ని ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తాం అనే విషయాల గురించి ఇంకా ఏమీ అనుకోలేదని తెలిపారు. నేను బాహుబలి తర్వాత చేయబోయే సినిమా మాత్రం దానయ్య నిర్మిస్తారు అని తెలిపారు.

2019లో రాజమౌళి-మహేశ్‌ సినిమా సెట్స్ పైకి రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి భరత్ అనే నేను అనే టైటిల్ పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -