Tuesday, April 30, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన పవన్..?

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఓ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయనున్నాడనే వార్తలు ఎప్పటి నుండో వస్తున్నాయి. ఈ మూవీ కోసం కొందరి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఏ విషయంలోను ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా ఈ సీన్ లోకి సంచలన దర్శకుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి ఎంటర్ అయ్యారు.

అర్జున్ రెడ్డి సినిమాతో ఈ దర్శకుడి పేరు టాప్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అర్జున్ రెడ్డి సృష్టించిన హంగామా అందరికి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇతర రాష్ట్రాల నిర్మాతలు కూడా పోటీ పడూతున్నారు. కాగా పవన్ కళ్యాణ్ కి సంబందించిన న్యూస్ ఏంటంటే.. .. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సందీప్ రెడ్డికి 50 లక్షల అడ్వాన్స్ ఇచ్చి తమకు ఓ సినిమా చేయమని అడిగారట. దీనితో ఈ ఈ డైరెక్టర్ పవన్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి.

అర్జున్ రెడ్డి సినిమా హిట్ టాక్ వచ్చినప్పుడే సందీప్ కి ఫోన్ చేసి అభినందించాడని.. మంచి కథతో వస్తే సినిమా చేద్దామని చెప్పినట్లు కూడా సినీ జనాలు చర్చించుకుంటున్నారు. సందీప్ పవన్ కు ఓ లైన్ కూడా వినిపించాడని దానిని మంచి కథగా మలిస్తే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైతే ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న గుసగుసలు. వీటిలో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -