Monday, May 20, 2024
- Advertisement -

ఎన్టీఆర్‍కి షాక్ పడింది?

- Advertisement -

బాహుబలి సినిమాతో తెలుగులోనే కాక ప్రపంచవ్యాప్తంగా మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి. అతను పేరు తెచ్చుకోవడమే కాక బాహుబలి తో తెలుగు సినిమా స్థాయి ని పెంచి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి ఏ సినిమా చెయబోతున్నాడు అనే విషయంపై అందరిలోను ఆసక్తి నెలకొంది.

కొన్ని రోజులుగా బాహుబలి తర్వాత జక్కన్న ఎన్టీఆర్‍తో గరుడ అనే సినిమా చేస్తాడు అనే వార్తలు వస్తున్న విషయం తెలిసింది. ఐతే ఇప్పుడు జక్కన్న ఎన్టీఆర్‌కు పెద్ద షాక్ ఇచ్చాడు. అయితే  ”గరుడ ” సినిమాని హాలీవుడ్ రేంజ్ లో దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందించాలని భావిస్తున్నాడు జక్కన్న. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడు గా నటిస్తాడని ఇంతకుముందే ప్రకటించాడు రాజమౌళి.

కానీ తాజాగా రాజమౌళి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎన్టీఆర్ స్థానంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఆ పాత్ర చేయనున్నాడట ! ఇది నిజంగా ఎన్టీఆర్ కే కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కూడా పెద్ద షాకే మరి. వెయ్యి కోట్ల బడ్జెట్ కావడంతో హృతిక్ అయితేనే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఎన్టీఆర్‍తో మరో సినిమా చేస్తాడట జక్కన్న.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -