Friday, May 17, 2024
- Advertisement -

పవన్‌‌కి జరిగినట్లే బన్నీకి కూడా జరిగింది

- Advertisement -

ఈ మధ్య కాలంలో సినిమా సెట్స్‌ మీద ఉండగానే ఆ సినిమాకి సంబధించి ఫోటోస్, సాంగ్స్ ఏదో ఒకటీ రిలీజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మొన్న ఈ మధ్య పవన్ సర్దర్ సినిమా ఎడిటింగ్ జరుగుతుండగా సినిమాలోని ఈ సన్నివేశం సంబంధించిన ఫోటో రిలీజ్ అయ్యి తెగ హల్ చల్ చేసింది.

అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సరైనోడు’. ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ కోసం బొలివియా వెళ్ళింది. ఈ పాటతో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఎంతో జాగ్రత్తగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమలు జరుపుకుంటున్న ఈ చిత్రంలోని ఓ పాట నెట్ లోకి లీక్ అయ్యింది.

ఈ లికేజి పై చిత్ర బృందం హైదరాబాద్ పోలీసులకు కంప్లెయింట్ చేసింది. ఇలా లీక్ అయిన పాటని ఎవరైనా ఉపయోగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరికలు జారి చేసింది. బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కేథరిన్ త్రేస లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో ను ఈ నెల 27న వైజాగ్ లో విడుదల చేసి, చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -