- Advertisement -
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష వైసీపీ వెంటవెంటనే రెండు అంశాలపై రెండు సార్లు వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వంపై వివిధ అంశాలపై వైసీపీ విరుచుకు పడింది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి కల్పన అంశాలపై ప్రభుత్వం మాట తప్పిందని జగన్ ఆరోపించారు. సర్కారు చర్యకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పించన్‌ల అంశంపైనా వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రభుత్వం సరైన సమాధానం చెప్పక పోవడంతో.. సభ నుంచి రెండోసారి వాకౌట్ చేసింది. విపక్షం ఆరోపణలను ప్రభుత్వం తన సమాధానంలో ఖండించింది.
