Sunday, May 12, 2024
- Advertisement -

బాహుబలి పార్ట్ 2 సీన్లు రీ షూట్!

- Advertisement -

బాహుబలి సినిమాతో తెలుగు సత్తా ఎంటో చూపాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రశంసలు వచ్చాయి. ఇటివలే ఈ సినిమాకి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ వచ్చింది. సో ఇప్పుడు రాబోతున్న బాహుబలి 2 పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. అయితే దర్శకుడు రాజమౌళీ బాహుబలి 2 మరింత బాధ్యత తెరకెక్కిస్తున్నాడట.

అందుకే ఏమాత్రం రాజీపడకుండా బాహుబలి పార్ట్ 2 ని మరింత జాగ్రత్తగా తెరకెక్కించాలని భావించిన రాజమౌళి ఇప్పటి వరకు తీసిన రష్ ని ఒకసారి చూసుకున్నాడట అయితే అందులో కొన్ని సీన్లు జక్కన్న కు సంతృప్తి ఇవ్వలేదట దాంతో వాటిని రీ షూట్ చేయాలనీ భావిస్తున్నాడట జక్కన్న.

క్వాలిటీ విషయం లో ఏమాత్రం రాజీ పడటం జక్కన్న కు నచ్చని విషయం అందుకే కొన్ని సీన్లని మళ్ళీ షూట్ చేయడానికి ఫిక్స్ అయ్యాడట. మాములుగానే జక్కన్న చాలా సమయం తీసుకొన్ని షూట్ చేస్తుంటాడు. సో ఇప్పుడు మళ్ళీ కొన్నీ సీన్లు రీ షూట్ చేయడం వల్ల మరింత సమయం పడుతుంది. ఇలా చేయడం వల్ల మెయిన్ గా ప్రభాస్ కి నష్టం జరుగుతుంది. ఇప్పటికే బాహుబలి సినిమాకి చాలా సమయం ఇచ్చాడు ప్రభాస్. ఇప్పుడు జక్కన్న రీషూట్ అంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభాస్ ఫ్యాన్ మాత్రం ఫీల్ అవుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -