Sunday, May 5, 2024
- Advertisement -

పార్టీ నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉన్న ఇద్ద‌రు నేత‌లు…

- Advertisement -

టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ఇద్ద‌రు ఎమ్మెల్యేలు త‌మ దారి తాము చూసుకుంటున్నారు. రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయ‌నె వార్త‌లు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై దృష్టిపెట్ట‌నున్నారు. ఇక్క‌డే ఉంటె భ‌విష్య‌త్తులో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని పార్టీ మారేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

అధికార పార్టీనుంచి ఇద్దురు నేత‌లు వైసీపీలోకి స్తున్నార‌నె వార్త‌లు సోషియ‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వారిలో ఒక‌రు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగ‌ల వేణుగోపాల్‌రెడ్డి, మ‌రొక‌రు ప్ర‌తిపాడుకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రు చంద్ర‌బాబు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

గ‌తంలో ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ ….త‌ర్వాత ఆ సీటును రాయ‌పాటికి ఇవ్వ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు వెస్ట్‌నుంచి ఎమ్ఎల్ఏగా పోటీ చేసివేణుగోపాల్ గెలుపొందారు. రాయ‌పాటికోసం ఎంపీ సీటును త్యాగం చేసినా త‌న‌కు మాత్రం మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్న హామీని బాబు మ‌రిచారు. దీంతో గ‌త కొంత‌కాలంగా అధినేత‌పై అసంతృప్తితో ఉన్నారు.

ఇక మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు విష‌యానికి వ‌స్తె ఆయ‌న‌మీద కావాల్సిక‌నె టీడీపీ క‌క్ష‌గ‌ట్టింద‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న్ను దూరంగా పెట్టారు. అప్ప‌ట్లోనె పార్టీ మారాల‌ని నిర్న‌యించుకున్నా కొన్ని పరిస్థితుల వ‌ల్ల అక్క‌డే కొన‌సాగుతున్నారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు కూడా ఇచ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకొని ఇద్ద‌రు నేత‌లు పార్టీ మారెందుకు సిద్ధంగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -