Wednesday, May 1, 2024
- Advertisement -

రానాతో బంధంపై ర‌కుల్ వ్యాఖ్య‌లు

- Advertisement -

రానాతో బంధంపై ర‌కుల్ వ్యాఖ్య‌లు

భ‌ళ్లాల దేవ‌తో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ప్రేమాయ‌ణం కొన‌సాగుతోంద‌ని.. అందుకే త‌ర‌చుగా వారిద్ద‌రూ వేడుక‌ల్లో.. యాత్ర‌ల్లో క‌లుస్తున్నార‌ని ప్ర‌చారాలు కొన‌సాగుతున్నాయి. ఇన్నాళ్లు త్రిష‌తో రానాను ముడిపెట్టిన వాళ్లు ఇప్పుడు ర‌కుల్‌తో రానాను ముడిపెడుతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని పుకార్లు సృష్టిస్తున్నారు. అయితే ఈ పుకార్ల‌ను వారిద్ద‌రూ కొట్టి పారేశారు. ఈ వదంతులు త‌మ‌కు కొత్త కాద‌ని తేల్చేశారు.

ఇదంతా అసత్య ప్రచారం అంటూ ఇద్దరూ కొట్టిపారేశారు. తన గురించి గాసిప్స్ రానా సరదాగా త‌న‌కు చెబుతుంటారని ర‌కుల్‌ప్రీత్‌సింగ్ చెప్పేసింది. ఇలాంటి వాటిని ఆయన రానా స్పోర్టివ్‌గా తీసుకుంటారని కొనియాడింది. కారణం అవన్నీ వదంతులు కావడమేనని రానా చెబుతాడంట‌. అయితే రానాతో త‌న‌కు ఉన్న బంధంపై మాట్లాడింది. రానా తాను చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పుకొచ్చింది. అలా తమ గ్రూప్‌లో 20 మంది ఉన్నారంట‌. వారిలో పెళ్లి కానివారు చాలా తక్కువ అని, వారందరితో సన్నిహితంగా ఉంటానని చెప్పింది. రానాతో తనను కలుపుతూ జరుగుతున్న ప్రచారం గురించి తామిద్దరం నవ్వుకుంటామని తెలిపింది. ఈ విధంగా రానాతో త‌న‌ను ముడిపెట్ట‌డం స‌రికాద‌ని పేర్కొంది. ప్రస్తుతం ర‌కుల్ తమిళం, తెలుగు, హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది.

https://www.youtube.com/watch?v=SNuDVKR_JF0

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -