Friday, May 10, 2024
- Advertisement -

ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వంతు!

- Advertisement -

తెలంగాణలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రస్థానం ముగిసింది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం.. ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు.. టీఆర్ఎస్ దృష్టి ఎమ్మెల్సీ ఎన్నికలపై పడింది. ఇన్నాళ్లూ జనరల్ ఎన్నికల స్థాయిలో ప్రచారాలు, విమర్శలతో హడావిడి చేసిన గులాబీ నేతలు… ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ చేశారు. 

డిసెంబర్ లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీలో ఆశావహులు జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎవరిని ప్రసన్నం చేసుకుంటే తమకు టికెట్ దక్కుతుందన్న విషయంలో ఆరా తీస్తున్నారు. మొన్నటి బై పోల్ లో.. మంత్రి, సీఎం తనయుడు కేటీఆర్ సన్నిహితుడిగా ముద్ర ఉన్న పసునూరి దయాకర్ కు టికెట్ రావడం.. ఆయన కోసం పార్టీ అంతా కలిసి రంగంలోకి దిగడంతో.. టికెట్ ఆశిస్తున్న నేతలంతా కేటీఆర్ కోటరీ వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటు.. కేసీఆర్ తనయ, ఎంపీ కవిత నుంచి కొందరు సీనియర్లు.. పార్టీని తెర వెనక ఉండి నడిపిస్తున్న మరో ముఖ్యనేత సీఎం మేనల్లుడు హరీష్ రావు నుంచి ఇంకొందరు నేతలు.. టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలంగాణ భవన్ లో నేతలు చర్చించుకుంటున్నారు. ఈ ముగ్గురే కాకుండా.. కేసీఆర్ కు అతి సన్నిహితంగా ఉండే ఇంకొందరు నేతలు కూడా డైరెక్ట్ రూట్ లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

అసలే అధికార పార్టీ.. అందునా బై పోల్ గెలిచిన జోష్.. అన్నీ కలిసి వచ్చి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ దక్కితే.. అందులో కూడా ప్రత్యర్థులతో పోటీలో విజయం సాధిస్తే.. మంచి ఫ్యూచర్ గ్యారెంటీ. ఇన్ని లెక్కలతోనే.. చోటా మోటా నేతలంతా ఎమ్మెల్సీ టికెట్ కోసం రేస్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. చూడాలి… సీఎం కేసీఆర్ ఎవరిని కరుణిస్తారో.. టికెట్లు ఎవరికిస్తారో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -