Monday, April 29, 2024
- Advertisement -

హనుమ విహారి..కెరీర్ అంతా వివాదాల మయమే!

- Advertisement -

హనుమా విహారి..టీమిండియా క్రికెటర్..ఏపీ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్‌. విహారి కెరీర్ అంతా వివాదాల మయమే. సాటి క్రీడాకారుల పట్ల దురుసు ప్రవర్తన..తాజాగా ఓ ఆటగాడితో విభేదాలు వెరసీ కెప్టెన్సీ పోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఓ రాజకీయ నాయకుడిపై ఆరోపణలు చేశారు విహారి. ఇక అసలు విషయం తెలియకుండానే పొలిటికల్ డ్రామా చేశారు చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు మరియు పచ్చ మీడియా.

క్రీడలకు రాజకీయాలు పులిమి. నాశనం చేయడానికి వెనుకాడడం లేదు ఎల్లో మీడియా. క్రికెటర్ హనుమ విహారి విషయంలో కూడా రామోజీ లేనిపోని కథనాలను వండివార్చి ఆ బురదను వైసీపీకి అంటగట్టాలని చూశారు. కాని వాస్తవాలు వేరుగా ఉన్నాయి. హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ కెప్టెన్ గా ఉన్నప్పటికి ఆది నుండి వివాదస్పదంగానే ఉంది. సాటి క్రీడాకారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పరుషంగా దూషించడం వంటి ఎన్నో ఫిర్యాదులు విహారిపై ఉన్నాయి.

దీనిపై క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ విచారణ చేసింది. ఆరోపణలు వాస్తవం అని తేలడంతో అతనికి రాతపూర్వకంగా నోటీసులిచ్చింది.దానికి హనుమ కూడా సమాధానం చెప్పాడు. బోర్డు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడే ఉంటానని సమాధానం చెప్పాడు. దానికనుగుణంగా అతనిపై బోర్డు చర్యలు తీసుకుంది.

దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని, విహారిని కెప్టెన్ గా తొలగించడంలో వైసీపీ ప్రమేయం ఉందని ఈనాడు విషపు కథనాలు ప్రచురించింది. అసత్య ప్రచారం చేసింది. ఇపుడు వాస్తవాలను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తెలియజేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -