Sunday, May 19, 2024
- Advertisement -

తమ్ముడు కోసం పవన్ ఇంటికి వెళ్లిన రామ్ చరణ్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పవన్ ఇద్దరికి విడాకులు ఇచ్చేశారు. ప్రస్తుతం పవన్ తన మూడో భార్యతో ఉంటారు. తాజాగా పవన్ కు కొడుకు పుట్టాడు. దాంతో ప్రస్తుతం పవన్ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడు సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండే పవన్.. పిల్లలకోసం తగిన సమయం కేటాయిస్తుంటాడు. కొడుకు పుట్టడంతో కొంత సమయం ఇంటి దగ్గరే గడిపేస్తున్నాడట. ఇక ఇటివలే రేణు దేశాయ్, మెగా స్టార్ చిరంజీవి.. పవన్ కు కొడుకు పుట్టడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తనకు తమ్ముడు పుట్టాడని తెగ సంతోషపడ్డాడట. అయితే పవన్ ఎక్కడైన షూటింగ్ లో ఉంటే చరణ్ వెళ్లి కలుస్తుంటాడు. కానీ చాలా రోజుల తర్వాత పవన్ ఇంటికి చరణ్ వెళ్ళాడట.

తన ముద్దుల తమ్ముడుని చూసుకోవడం కోసం చరణ్ పవన్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. చాలా సేపే ఇంట్లో ఉండి సరదాగా గడిపాడట చరణ్. పవన్ కి కూడా చరణ్ అంటే చాలా ఇష్టం. చరణ్ రావడంతో పవన్ తెగ సంతోషపడ్డాడట. ఎంతైన రక్త సంబంధం కదా.. ఆ ప్రేమలు వేరే అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఫస్ట్ లుక్ ను పవన్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక పవన్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -