Monday, May 6, 2024
- Advertisement -

ఓంకారన్నయ్య ఏంటి ఇలా చేశావ్ ..

- Advertisement -

రాజుగారి గది-2 సినిమా మొదటిపార్ట్ తో పోలిస్తే… సెకండాఫ్ చాలా వరకు సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి. అయితే ఓంకార్ తన తమ్ముడు అశ్విన్ ను హీరోగా నిలబెట్టడం కోసం చేసిన కొన్ని ప్రయత్నాలు సినిమాకు మైనస్ గా మారాయి. నాగార్జున లాంటి హీరో సినిమాలో ఉన్నప్పుడు ఈ తప్పులు ఓంకార్ చేయకూడదు. అయినా చేసేశాడు. షీరత్ కపూర్ అందాల ఆరబోత సినిమా ఫస్టాఫ్ కు ఆయువు పట్టు అయితే… రుద్ర పాత్రలో నాగ్ చేసిన మెంటలిస్ట్ రోల్ సినిమాను మరో మెట్టు పైకి తీసుకువచ్చింది.

థమన్ పాటలు సినిమాకు ఏ విధంగాను కలిసిరావనే చెప్పాలి. సెకండాఫ్ లో తీసుకున్న ఆర్ ఆర్ జాగ్రత్త ఫస్టాఫ్ లోను చూపిస్తే.. భాగుండేది. ఇక అబ్బూరి రవి చాలాకాలం తరువాత మళ్లీ తన పెన్ కు పని చెప్పాడు. ఓంకార్ డైరెక్షన్ కమర్శియల్ గా వర్కవుట్ అయింది. సమంతా-నాగార్జున మధ్యలో నడిచిన సీన్లు భాగా పండాయి.ఐతే జస్ట్ ముగ్గురు కమెడియన్లతోనే ఓంకార్ బండి లాగించేయాలనుకోవడం సినిమాకు మైనస్ అనే చెప్పాలి.

కీల‌క‌మైన క్లైమాక్స్‌ను బాగా ఎలివేట్ చేసిన మన ఓంకారన్నయ్య చక్కని సందేశం ఇచ్చాడు. నాగ్, సమంతాల కోసమైనా ఓపెనింగ్స్ అయితే వస్తాయని చెప్పాలి. రాజు గారి గ‌ది రేంజ్‌లో లేక‌పోవ‌డం కూడా సినిమాకు మైనస్ గా మారిపోయే అంశం. రాజా ది గ్రేట్ అనుకున్నంత పేరు రాకపోతే.. ఈనెలాఖరు వరకు రాజుగారి గదికే కలెక్షన్లని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -