Thursday, May 2, 2024
- Advertisement -

‘ఆచార్య’లో రామ్ చరణ్ పాత్రపై కొత్త ట్విస్ట్!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో చరణ్ గెస్ట్ పాత్ర పోషిస్తున్నట్టు ఇన్నాళ్లూ ప్రచారం జరిగింది. వాస్తవానికి కరోనా వైరస్ రాకుంటే ‘ఆచార్య’ ఎప్పుడో రిలీజ్ అయ్యేది. ఇప్పటి వరకు మెగా అభిమానులు తండ్రీ కొడుకులు తెరపై ఫుల్ లెన్త్ కనిపిస్తే ఎంతో బాగుంటుందని అందరూ భావించారు.  ఇప్పుడిలాంటి చిత్రాన్ని చూసే అవకాశం త్వరలో అభిమానులకు కలగనుంది.

ఇక తండ్రీతనయులు కలసి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ విషయం అందరికీ తెలిసిందే.. కాకపోతే రామ్ చరణ్ గెస్ట్ పాత్రలో కనిపిస్తారని అందరూ భావించారు. అయితే  చరణ్ పోషించే పాత్ర చిన్న పాత్ర కాదనీ, చిరంజీవి పాత్ర నిడివికి సమానంగా ఇది కూడా ఉంటుందనీ అంటున్నారు.  

లాక్ డౌన్ వల్ల ఏర్పడిన విరామం తర్వాత ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది. మరోవైపు అందాల బొమ్మ కాజల్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. ఇది పూర్తి కాగానే ‘ఆచార్య’ షూటింగ్ లో జాయిన్ అవుతారని ఇండస్ట్రీలో టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -