Wednesday, May 15, 2024
- Advertisement -

రజనీ పార్టీ ఇదేనంటూ ప్రచారం.. ఓపిక పట్టండీ అంటున్నఆర్ఎంఎం!

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే.  రజినీకాంత్ కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సొంతంగా పార్టీని పెట్టి 2021లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  ఇటీవలే నమోదైన మక్కళ్ సేవై కట్చి (ఎంఎస్ కే) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తు కేటాయించిన నేపథ్యంలో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పేరు ఇదేనంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై ఆయన పార్టీ సభ్యులు రజనీ మక్కళ్ మండ్రం (ఆర్ఎంఎం) వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. మక్కల్ సేవై కర్చి అంటే ప్రజాసేవ పార్టీ అని అర్ధం.  రజినీకాంత్ బాషా సినిమాలో ఆటో డ్రైవర్ గా కనిపించారు.  కాగా, కొత్త పార్టీ పేరుపై అధికారిక ప్రకటన వచ్చే దాకా ఓపిక పట్టాలని సూచించింది.

రజనీకాంత్ అభిమానులు, ఆర్ఎంఎం సభ్యులు పార్టీ పేరు ప్రచారంపై సంయమనం పాటించాలని, పార్టీ పేరు, గుర్తు ప్రకటించేదాకా ఆగాలని హితవు పలికింది.  మరోవైపు  అభిమానులు బాషా లోని రజినీకాంత్ ఆటో ఫోటోలను పోస్టు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -