Saturday, May 18, 2024
- Advertisement -

విజయవాడ పార్లమెంటుకు వైసీపీ తరపున సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ త‌మ్ముడు శేషగిరిరావు

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో పార్టీల‌కు సినిమాస్టార్స్ ప్ర‌ధానం కానున్నారు.అన్ని పార్టీల‌కు సినీ గ్లామ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌పోషించ‌నుంది. ఇప్ప‌టికే టీడీపీకి సినీ గ్లామ‌ర్ పుస్క‌లంగా ఉండ‌గా…ఇక వైసీపీకి అంత సినీ గ్లామ‌ర్‌లేదు. కాని ఆదిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు.
వ‌చ్చే స‌ర్వ‌త్రిక ఎన్నిక‌లు వైసీపీకి చావో రేవోలాంటివి.అందుకే గెలుపు గుర్రాల‌పై వేట కొన‌సాగిస్తున్నారు.విజ‌య‌వాడ‌నుంచి అలనాటి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తమ్ముడు, ఇప్పటి సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయ్ అయిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విజయవాడ నుండి వైసీపీ తరపున పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.
తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో విజయవాడ పార్లమెంటుకు శేషగిరిరావు పోటీ చేస్తే బాగుంటుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు సమాచారం. విజయవాడ లోక్ సభ కు వైసీపీ తరపున వారు పోటీ చేస్తారు, వీరు పోటీ చేస్తారని ఇప్పటి వరకూ వినిపిచిన పేర్లన్నీ ఉత్త ప్రచారంగానే మిగిలిపోయాయి.
విజయవాడ నుండి శేషగిరిరావు పోటీ చేయాలని జగన్ గట్టిగా కోరుతున్నారు. అయితే, శేషగిరిరావు మాత్రం కాస్త ఊగిసలాటలో ఉన్నారని సమాచారం. వయసు తదితరాల నేపధ్యంలో పోటీ చేయటానికి వెనకాడుతున్నట్లు తెలిసింది. అదే విషయాన్ని జగన్ తో కూడా చెప్పారట. ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఓ పదవి తీసుకుంటాను అని చెప్పారట.
అయితే, జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదట. కాగా శేషగిరిరావుకు జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ తో కూడా బాగా సన్నిహితంగా ఉండేవారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ ఏదైనా కారణాంతరాల వల్ల శేషగిరిరావు గనుక వెనకాడితే ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పివిపి) అభ్యర్ధిగా ఉండవచ్చని సమాచారం. మ‌హేష్ బాబాయ్ పోటీ చేస్తే వైసీపీకి మ‌రింత బ‌లం చేకూరుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -