డైరెక్టర్ శంకర్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతీయుడు సినిమా నుంచి మొన్నొచ్చిన స్నేహితుడు వరకు ఆయన డైరెక్షన్ అంటే సినీ ప్రేమికులకు ఎంతో ఇష్టం. అలాగే ఆయన డైరెక్షన్ లో యాక్ట్ చేయాలని పెద్దపెద్ద హీరోలు సైతం ఎంతో ప్రయత్నిస్తుంటారు. భారీ బడ్జెట్ సినిమాలను తీయడంలో శంకర్ దిట్ట. ఆయన తీసిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి.
అలాంటి గ్రేట్ డైరెక్టర్ తో సినిమా తీసే చాన్స్ ను ఇప్పుడు రామ్ చరణ్ కొట్టేశాడు. అయితే చరణ్, శంకర్ కంబినేషన్ లో ఒక భారీ చిత్రాన్ని తీసేందుకు కొన్నేండ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజక్టును ఇప్పటికి ఒక భారీ సెట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో దీన్ని తియబోతున్నారని సమాచారం.
రాజమౌళి దర్శకత్వంలో చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా మొదలు పెడతారని తెలుస్తోంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి, శంకర్ ల కాంబినేషన్లో ఒక భారీ చిత్రాన్ని తీయాలని గతంలో ఎన్నో ప్రయాత్నాలు జరిగాయని సమాచారం. వాటికి పలు కారణాలు అడ్డుపడ్దాయిన తెలుస్తోంది. కానీ ఇప్పడు మెగాస్టార్ కొడుకు చరణ్ హీరోగా శంకర్ సినిమా చేస్తున్నారనేది ఎంతో విశేషాన్ని సంతరించుకుంది.
కొత్త సినిమాతో రాబోతున్న నాని! హిట్ కొట్టనున్నాడా ?
‘ప్రేమికుల రోజు’న ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్..!
‘మహాసముద్రం’ పవర్ఫుల్ లుక్లో జగపతిబాబు
‘ఉప్పెన’ బ్యూటీతో యంగ్ టైగర్ రోమాన్స్ !