Friday, May 17, 2024
- Advertisement -

చిరు సైరా లో రామ్ చరణ్ చేయబోయే పాత్ర ఇదే

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ‘సై.. రా నరసింహారెడ్డి’ సినిమాన్ని రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులు శరివేగంగా జరుగుతున్నాయి. ఆ పనులు అయిపోగానే వెంటనే మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

అయితే చాలా కాలంగా ఈ సినిమాలో చిరుతో పాటు రామ్‌చరణ్ కూడా కనిపిస్తాడనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో రామ్‌చరణ్ పాత్ర ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపిస్తుండగా.. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక రాజు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. స్వాతంత్ర్యం కోసం పోరాడే ఉయ్యాలవాడకు వెన్నుదండుగా రామ్ చరణ్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

రామ్‌చరణ్ కనిపించబోయే రాజు పాత్ర కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన లుక్ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. చిరు నటించిన 150వ సినిమాలో కూడా చరణ్ ఓ పాటలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సారి ఏకంగా ఒక పాత్రను దక్కించుకున్నాడు. ఈ మూవీని రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -