Thursday, May 2, 2024
- Advertisement -

రానా బాహుబలి 2 పై క్లారిటీ ఇచ్చాడు

- Advertisement -

‘బాహుబలి’ సినిమా గొప్ప విజయం సాధించింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు బాహుబలి 2 చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ బాహుబలి 2 చిత్ర షుటింగ్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. ఈ సినిమా షుటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో ఈ సినిమా 2017లో వస్తుందని అనుకున్నారు.

అయితే బాహుబలి-2 పై ఎవరు సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు. కానీ రానా మాత్రం ఒక క్లారిటీ ఇచ్చాడు. హీరో సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు ఆడియోకు గెస్ట్ గా రానా వెళ్లాడు. అయితే ఈ ఆడియో ఫంక్షన్ లో సుమ అడిగిన ప్రశ్నకు బాహుబలి 2 చిత్రం 2016లో కూడా రిలీజ్ కాకపోవచ్చు అన్నట్లు క్లూ ఇచ్చాడు రానా.

అయితే డిసెంబర్ లో ఈ బాహుబలి 2 షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. రాజమౌళి  మాత్రం బాహుబలి-2 అద్భుతంగా రావాలి అని ఇంకా స్క్రిప్టు పైనే పనిచేస్తున్నట్లు సమాచారం. మరి ఈ బాహుబలి 2 చిత్రం 2016 లేక 2017లో వస్తుందో చూడాలి మరి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -