Saturday, May 18, 2024
- Advertisement -

సైజ్ జీరో రివ్యూ

- Advertisement -

‘అనుష్క ‘ నేటి తరం లో హీరోలకి తగ్గట్టుగా కలక్షన్ లు రాబడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు కురిపిస్తున్న హీరోయిన్. హీరోయిన్ లలో సూపర్ స్టార్ గా వెలుగుతున్న ఆమె పట్టిందల్లా బంగారం అవుతోంది. దాదాపుఎనభై కోట్ల బడ్జెట్ సినిమా రుద్రమ దేవి ని ఆమె మీది చిత్రీకరించి కలక్షన్ లు వెనక్కి రాబట్టారు అంటే అదంతా అనుష్క రేంజ్ ని చూపిస్తోంది.

పీవీపీ సినిమా లో నిర్మించబడ్డ ఈ సినిమా ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చింది. రాఘవేంద్ర రావు గారి అబ్బాయి గా పేరున్న ప్రకాష్ ఈ సినిమా తో తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకోవాలి అనుకుంటున్నాడు. ఈ సినిమా అటు స్వీటీ కీ ఇటు ప్రకాష్ కి ఎంత మేర ఉపయోగ పడిందో చూద్దాం 

లావు గా ఉండే స్వీటీ – సౌందర్య (అనుష్క) చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. తన తండ్రి రాజేశ్వరి (ఊర్వసి) నుంచి పెళ్లి విషయం లో బరువు తగ్గమని విపరీతమైన ఒత్తిడి వస్తూ ఉంటె ఇంకా బరువు పెరుగుతూ ఉండే పాత్ర ఈమెది. విదేశాల్లో ఉండే సంబంధం అభి(ఆర్య) తనని చూసుకోవడానికి వచ్చినప్పుడు అతన్ని రిజెక్ట్ చేసి అతన్నితో స్నేహం చేస్తుంది. నెమ్మది నెమ్మదిగా అతని పట్ల ఆకర్షణ కి గురై అతనితో ప్రేమలో పడుతుంది అనుష్క. భారత దేశం మీద డాక్యుమెంటరీ కి ప్లాన్ చేసిన అభి తో చేతులు కలిపి అతని చుట్టూ తిరిగే సిమ్రాన్ (సోనాల్ చౌహాన్) అంటే పడదు అనుష్క కి.మరొక పక్క  సైజ్ జీరో అనే క్లినిక్ ని నడుపుతూ ఉంటాడు సత్యానంద్(ప్రకాష్) అతని దగ్గర ప్రాక్టీస్ చేసి సైజ్ తగ్గి మరీ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇంతకీ ఆమె సైజ్ తగ్గిందా సత్యానంద్ వల్ల ఆమెకి మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది ఈ సినిమా కథాంశం. 

ఈ సినిమా కోసం అనుష్క చాలా కష్టపడింది, ఆ విషయం తెరమీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్ లూ, ఆమె లావు ఉన్న అమ్మాయిగా కనపడ్డం కోసం పడ్డ శ్రమా సినిమాలో చూడచ్చు. తనకి నచ్చిన అబ్బాయి తాను నచ్చలేదు అని చెబితే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని ఒక సగటు ఆడపిల్ల గా అనుష్క యాక్షన్ ఆదరకోట్టేసింది. ఎన్నారై గా ఆర్య కూడా చాలా బాగా చేసాడు. సోనాల్ చౌహాన్ గ్లామర్ పాత్ర చేసింది. తల్లి గా ఊర్వసి కూడా బాగా చేసింది. ప్రకాష్ సంగతి చెప్పనక్కరలేదు. పోసానీ, ఆలీ, బ్రహ్మానందం లు తమ పాత్రల మేర చేసారు . అనుష్క పెర్ఫార్మెన్స్ , పవర్ ఫుల్ డైలాగులు, కెమెరా పనితనం , ఆర్య – అనుష్క ల కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది 

ఇలాంటి ఒక విభిన్న కథాంశం ఎంచుకున్నప్పుడు సినిమాని అనవసర రీతి లో స్లో చేసాడు డైరెక్టర్. ప్లాట్ కూడా ఎస్టాబ్లిష్ చేసే సమయం లో సరిగ్గా చెయ్యలేక పోయాడు. స్క్రీన్ ప్లే విభాగం లో టోటల్ గా ఫెయిల్ అయ్యారు. సీన్ కీ సీన్ కీ కనక్షన్ చేసే క్రమం లో చాలా స్లో పేస్ తో చిత్రం సాగింది. కామెడి కూడా చాలా ఫోర్సిడ్ అనిపిస్తుంది. పాటలు అనవసరమైన చోట పడ్డాయి. మంచి ఎమోషనల్ పంథా ని తీసుకుని దానికి తగ్గ డ్రామా ని రాయలేదు. సీన్ లు చాలా చోట్ల డ్రాగ్ అయినట్టు అనిపించాయి. అనుష్క ఎలా అయితే తన ఒంటి మీద శ్రద్ధ పెట్టి కథ కోసం అంతగా పెరిగిందో ప్రకాష్ కూడా అదే శ్రద్ధ కథ మీద పెట్టాల్సింది అనిపిస్తుంది. స్వీటీ హార్డ్ వర్క్ నీ డెడికేషన్ నీ డైరెక్టర్ తక్కువ చేసాడా అనిపిస్తుంది. 

మొత్తంగా ఒక్క సారి చూడదగ్గ సినిమా తప్ప , సీరియస్ అంశాల గురించి సరైన చర్చ జరగనే లేదు. సీన్ సీన్ కీ కనెక్టివిటీ బాగా మిస్ అవుతూ వచ్చింది. స్వీటీ పెర్ఫార్మెన్స్ కోసం చూసి తీరాలి అని చెప్పచ్చు. ముఖ్యంగా ఆమె తన శరీరాన్ని పెంచుకున్న విధానం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇలాంటి కొత్త పంథా తనకి మాత్రమె సాధ్యం అని స్వీటీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -